ఘనంగా ఆది-నిక్కీ పెళ్లి

నటుడు ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ వివాహం నిన్న రాత్రి చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటైంది. నాని, సందీప్ కిషన్, ఆర్య లాంటి హీరోలు ఈ పెళ్లికి హాజరయ్యారు. తారల తళుకుబెళుకులకు దూరంగా, సింపుల్ గా జరిగింది ఈ వివాహం.

కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ. తమిళ సినిమాల్లో కలిసి నటించిన ఈ జంట, అప్పట్నుంచి మంచి స్నేహితులయ్యారు. స్నేహాన్ని దాటి ప్రేమలోకి ఎంటరైన విషయాన్ని లాక్ డౌన్ టైమ్ లో తెలుసుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.

అనుకున్నట్టుగానే ఈ ఏడాది మార్చి లో ఆది-నిక్కీ నిశ్చితార్థం చేసుకున్నారు. రాత్రి పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ పెళ్లికి అటు నిక్కీ, ఇటు ఆది తరఫు బంధువులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీ ప్రముఖులకు వీళ్లు పార్టీ ఇస్తారా ఇవ్వరా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ప్రస్తుతం ది వారియర్ అనే సినిమా చేస్తున్నాడు ఆది పినిశెట్టి. అటు నిక్కీ చేతిలో తమిళ, మలయాళ సినిమాలున్నాయి. ప్రస్తుతానికి చెన్నైలోనే కాపురం పెట్టాలని ఈ జంట నిర్ణయించుకుంది. చెన్నైలో ఆది పినిశెట్టికి సొంతిల్లు ఉంది.

 

More

Related Stories