- Advertisement -

ఆది సాయికుమార్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఒక మూవీ విడుదల చేశాడు. లేటెస్టుగా నటిస్తున్న మరో సినిమా “సీఎస్ఐ సనాతన్”.
ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా కనిపిస్తాడు ఆది. గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న “సీఎస్ఐ సనాతన్” సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.
ఒక బిల్డింగ్ లో జరిగిన హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో తన టీమ్ తో రావడం చూపించారు ఈ మొదటి మోషన్ పోస్టర్ లో. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆదిసాయికుమార్ సరసన మిషా నారంగ్ నటిస్తోంది. శివశంకర్ దేవ్ దర్శకుడు.