డజన్ ఫ్లాపుల హీరోకి కొత్త ఆఫర్లు ఎలా?

- Advertisement -
Aadi Saikumar

ఒక హీరో వరుసగా రెండు, మూడు ఫ్లాపులు ఇస్తేనే నిర్మాతలు ముఖం చాటేస్తారు. మూడు, నాలుగు అపజయాలు అందుకుంటే హీరోయిన్లకి ఐరన్ లెగ్ అనే టాగ్ వస్తుంది. మరి, ఒక హీరో డజన్ ఫ్లాపులు ఇస్తే? అవును… హీరో ఆది సాయికుమార్ ఇప్పటివరకు 14 సినిమాల్లో నటించాడు. అందులో 12 సినిమాలు అపజయాలే. పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు, కొన్నవారికి నష్టాలే.

గత వీకెండ్ ‘శశి’ అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా మూడు రోజులకు గాను 30 లక్షలు కలెక్ట్ చేసింది. ఇంకా 20 లక్షలకు (వస్తే) మించి రావు. ఈ సినిమాలో ఒక పాట బాగా వైరల్ అయింది. సాంగ్ వైరల్ అయితేనే, ఆది సాయికుమార్ సినిమాకి వచ్చే ఓపెనింగ్ ఇలా ఉంది మరి. అది కూడా లేకపోతే అంతే సంగతులు. థియేటర్ వైపు కూడా ముఖం చూడరు జనం. మరి ఆది హీరోగా సినిమాలు ఎలా తెస్తున్నారు? ఇదే ఒక మిస్టరీ.

‘శశి’ సినిమా ఫ్లాపు అయినా కూడా ఈ హీరోతో మరో సినిమాని అనౌన్స్ చేశారు కొత్త నిర్మాతలు. ఇది ఉగాదికి ప్రారంభం అవుతుందట. ఏ విధంగా చూసినా ఆది అదృష్టవంతుడు. డజన్ సినిమాలు ఢమాల్ అన్న తర్వాత కూడా అవకాశాలు రావడం అంటే సుడి ఉంది అనకుండా ఏమనగలం చెప్పండి!

 

More

Related Stories