ఆదివారం లవ్లీ గా స్టార్ మా !

Star Maa

వారంలో ఆదివారానికో ప్రత్యేకత ఉంటుంది. ఆదివారం  ఎలా గడపాలా అని వీక్ అంతా ఆలోచిస్తుంటారు చాలా మంది. ఫ్యామిలీలో వారమంతా ఎవరెంత బిజీగా వున్నా అందరూ కలిసి ఉండేది మాత్రం ఆ ఒక్క రోజే. అలాంటి ఆదివారానికి (ఫిబ్రవరి 21న) స్టార్ మా ఓ కొత్త “మెనూ అఫ్ ఎంటర్ టైన్మెంట్” ని సిద్ధం చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ ప్రయాణం “ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్ టైన్మెంట్” అందించబోతోంది.

మధ్యాహ్నం 12 గంటలకు సీనియర్ యాంకర్ సుమ నవ్వించే తన సహజ ధోరణితో ” స్టార్ట్ మ్యూజిక్ “ని 100 % అద్భుతంగా తీర్చిదిద్దితే , ఆ వెంటనే 1. గంటలకు వర్షిణి తన “కామెడీ స్టార్స్” తో గ్యాప్ లేకుండా 100% నవ్వులు పంచబోతోంది.

ఇక సాయంత్రం 6 గంటలకు స్టార్ మా తన ప్రేక్షకుల్ని ఓ ప్రేమ ప్రపంచం లోకి తీస్కెళ్లబోతోంది. ఆ గ్రాండ్ ఈవెంట్ “100% లవ్”. రీల్ జంటలకు, రియల్ జంటలకు మధ్య సరదా పోటీగా రాబోతున్న “100% లవ్” అందమైన “ఎక్స్ ప్రెషన్ అఫ్ లవ్” గా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనసుని ఆహ్లాదపరిచే పాటలు , జీవితాన్ని పంచుకోవాలనే నిర్ణయం తీసుకున్న ఎమోషనల్ మూమెంట్స్, ప్రేమను మాటల్లోకి అనువదించిన అపురూప క్షణాలు.. అన్నీ కలిసి “100% లవ్” ఈవెంట్ స్టార్ మా కుటుంబ సభ్యులందరికీ పసందైన ఓ విందు. నవ్వులు, ఆటలు, పాటలతో పాటు ప్రేమ.. స్టార్ మా ఈ ఆదివారానికి మరింత ప్రత్యేకం.

“100% లవ్” ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

#Uppena team celebrates Love with couples. #Sukumar dance highlight 👌 '100% Love' Sunday at 6 PM

Press release by: Indian Clicks, LLC

More

Related Stories