‘ఆకాశం’కి టీవిలో డీసెంట్ రేటింగ్

Aakaasam Nee Haddhu Ra ! - Official Trailer

సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా థియేటర్లో విడుదల కాలేదు. లాక్డౌన్లో డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. సినిమా ప్రశంసలు అందుకొంది. డిజిటల్ వేదికపై డైరెక్ట్ గా రిలీజయిన సినిమాల్లో ది బెస్ట్ అనిపించుకొంది. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రసారం చేసింది జెమినీ టీవీ.

‘ఆకాశం నీ హద్దురా’కి ఏపీ, తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో 6.77 TVR వచ్చింది. ఒక అనువాద చిత్రానికి ఇది మంచి రేటింగ్. కొత్త సినిమా ప్రీమియర్ అయినప్పుడు కనీసం 10 పాయింట్ల రేటింగ్ అయినా రావాలి. కానీ ఇది డబ్బింగ్ సినిమా కాబట్టి… ఈ రేటింగ్ ని డీసెంట్ గానే పరిగణించాలి.

ఇక నితిన్, రష్మిక నటించిన ‘భీష్మ’ మొదటిసారి టీవీల్లో ప్రసారం చేసినప్పుడు చాలా తక్కువ రేటింగ్ తెచ్చుకొంది. కానీ జనవరి 10న ప్రసారం చేసినప్పుడు
7.59 TVR రాబట్టుకొంది. ఫస్ట్ టైం కన్నా రెండోస్సారే మంచి రేటింగ్ వచ్చింది.

గత వారం టీవీల్లో ప్రసారం ఐన తెలుగు సినిమాల్లో చెప్పుకోదగ్గ రేటింగ్ తెచ్చుకున్న చిత్రాలివే.

టీవీల్లో ఎన్ని సార్లు వేసినా వినయ విధేయ రామ (3.88 TVR) చిత్రానికి చెప్పుకోదగ్గ రేటింగ్ వస్తూనే ఉంది. గంగ (3.49 TVR), బిచ్చగాడు (3.60 TVR) వంటి పాత సినిమాలు కూడా రేటింగ్ పొందాయి.

More

Related Stories