- Advertisement -

ఆమని పరిస్థితి విషమంగా ఉందని, ఆమె హార్ట్ సమస్యతో బాధపడుతోందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆమని స్పందించింది. ఒక సినిమా షూటింగ్ కోసం మంచిర్యాల వెళ్తే, అక్కడ ఫుడ్ పాయిజినింగ్ అయిందట. అంతకుమించి మరే సమస్య లేదంట.
చిన్న విషయాన్ని చిలువలు పలువలుగా మార్చి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అని మండిపండుతోంది ఆమని. “నాకే కాదు మొత్తం టీంలో అందరికే ఫుడ్ పాయిజినింగ్ అయింది. ఇప్పుడు కోలుకున్నాం అంతా,” అని క్లారిటీ ఇచ్చింది.
ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగొందిన ఆమని ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తోంది.