అమీర్ ఖాన్ భయపడ్డాడు!

Aamir Khan

అమీర్ ఖాన్ కూడా భయపడ్డాడు. ఇటీవల బాలీవుడ్ హీరోలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు బీజేపీ, ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా బ్యాచ్. సైఫ్ అలీ ఖాన్ నటించిన ‘తాండప్’ వెబ్ సిరీస్ పై కేసులు కూడా పడ్డాయి. దాంతో, అమెజాన్ సంస్థ తాజాగా ‘బహిరంగ క్షమాపణ’ కోరింది. ఇలాంటి ‘ఇబ్బందికర’ పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకున్నాడు కాబోలు అమీర్ ఖాన్ ‘మహాభారతం’ వెబ్ సిరీస్ ని తీసే ఆలోచనని విరమించుకున్నాడు.

అనేక సీజన్లుగా భారీ ఎత్తున మహాభారతాన్ని నిర్మించాలని అమీర్ ఖాన్ భావించాడు. ఈ వెబ్ సిరీస్ కోసమే ఒక భారీ సినిమాని కూడా కాదనుకున్నాడు. రైటర్లకు, డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చాడు. ఐతే, వెబ్ సిరీస్ కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో అమీర్ ఖాన్ ఆ ఆలోచనని విరమించుకున్నాడట.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని టార్గెట్ చేస్తారని, అందులో ఏ మాత్రం పొరపాటు జరిగినా తనని అడ్డంగా ఇరికిస్తారని అమీర్ ఖాన్ భావిస్తున్నాడు. సో, అమీర్ ఖాన్ నుంచి ‘మహాభారతం’ రాదు.

More

Related Stories