అమీర్ ఖాన్ కి కరోనా

Aamir Khan

బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. 56 ఏళ్ల అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. తనకి కరోనా అని తేలిన వెంటనే ఆయన క్వారెంటైన్ లోకి వెళ్లిపోయారు. “ప్రస్తుతం ఆయన మామూలుగానే ఉన్నారు, వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉండి కోవిడ్ ట్రీట్ మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. వర్రీ కావాల్సిందేమి లేదు,” అని అమీర్ ఖాన్ పీఆర్వో తెలిపారు.

మహారాష్త్రలో కోవిడ్ 19 సెకండ్ వేవ్ విపరీతంగా ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కన్నా ముంబైలోనే మళ్ళీ ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే, బాలీవుడ్ స్టార్స్ వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల రన్బీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ లకు కరోనా సోకింది.

More

Related Stories