“ఆరంభం” బాగుంది కదా!

SSMB28 Aarambham


మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. శంకరపల్లి సమీపంలో వేసిన ఒక ఇంటి సెట్ లో మహేష్ బాబు, హీరోయిన్లు పూజ హెగ్డే, శ్రీలీలపై కీలకమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఆగస్టులో కానీ, దసరాకి కానీ విడుదల అవుతుంది.

ఐతే, ఈ లోపే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ గురించి డిస్కషన్ నడుస్తోంది సోషల్ మీడియాలో. ఉగాది సందర్భంగా టైటిల్ ప్రకటన ఉంటుంది అని చర్చ జరుగుతోంది.

ఈ సినిమా మొదటిసారి ప్రకటించినప్పుడు ##SSMB28ఆరంభం అనే హాష్ టాగ్ ని ట్రెండ్ చేశారు. నిజానికి ‘ఆరంభం’ అనే టైటిల్ బాగుంది. అదే ఈ సినిమాకి కంటిన్యూ చెయ్యొచ్చు కథకి కుదిరితే.

త్రివిక్రమ్ కి ‘A’ సెంటిమెంట్ ఉంది. అతడు, అత్తారింటికి దారేది, అఆ, అరవింద సామెత, అల వైకుంఠపురంలో…. ఇలా పలు చిత్రాలు ‘A’ సెంటిమెంట్ తో టైటిల్స్ పుట్టాయి. ఆ లెక్కన ‘ఆరంభం’ కూడా సరిపోతుంది. మరి త్రివిక్రమ్ మదిలో ఏ ఆలోచన ఉందో.

 

More

Related Stories