నిజంగానే ‘ఆవిరి’ అయింది

Aaviri

కొన్ని సూపర్ హిట్ సినిమాలు టీవీల్లో ఫెయిల్ అవుతుంటాయి. కొన్ని ఫ్లాప్ సినిమాలు ఊహించని విధంగా టీవీల్లో క్లిక్ అవుతుంటాయి. ఈ రెండు సందర్భాల్లో ప్రేక్షకుడు ఒకింత ఆశ్చర్యానికి లోనవుతాడు. అయితే కొన్ని సినిమాలుంటాయి. అవి థియేటర్లలో ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో, టీవీల్లో కూడా వాటి పనితీరు అలానే ఉంటుంది. దీనికి ఉదాహరణ ‘ఆవిరి’ అనే సినిమా.

రవిబాబు డైరక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. అందుకు తగ్గట్టే టీవీల్లో కూడా ఈ సినిమాకు బొటాబొటి టీఆర్పీ వచ్చింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీలో ప్రసారమైన ఈ సినిమాకు కేవలం 4.46 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. అలా ‘ఆవిరి’ సినిమా కథ ముగిసింది.

అయితే ఇక్కడో విషయాన్ని చెప్పుకోవాలి. ఈటీవీలో ప్రసారమయ్యే సినిమాలకు భారీ రేటింగ్స్ రావు. ఎందుకంటే, సినిమాలకు వాళ్లు కల్పించే ప్రచారం, టెలికాస్ట్ చేసే సమయం అలా ఉంటాయి మరి. ఈ లెక్కన చూసుకుంటే ‘ఆవిరి’కి ఉన్నంతలో ఇది బెటర్ రేటింగ్ అని చెప్పుకోవాలి.

ఇక జనరల్ ఎంటర్ టైన్ మెంట్స్ ఛానెల్స్ లో ఈ వారం (అక్టోబర్ 31-నవంబర్ 6) కూడా స్టార్ మా ఛానెల్ టాప్ లో నిలిచింది. చరిత్రాత్మక 1000 జీఆర్పీకి జస్ట్ 7 పాయింట్ల దూరంలో నిలిచింది. వచ్చే వారం రేటింగ్స్ లోనైనా ఈ ఛానెల్ 1000 జీఆర్పీ మార్క్ అందుకుంటే.. అది ఇండియన్ టెలివిజన్ హిస్టరీలో రికార్డ్ అవుతుంది.

Related Stories