అభిజీత్ వెంట పడుతున్న ఫిలిం మేకర్స్

Abhijeet

బిగ్ బాస్ 4 విజేతగా అభిజీత్ అని ప్రకటించిన వెంటనే… అతని ఇంటికి ఫిలిం మేకర్స్ క్యూ కట్టారు. హైదరాబాద్ లోని అభిజీత్ ఇంటి వద్ద సోమవారం అంతా నిర్మాతలు, దర్శకులు, షోరూం కంపెనీ యజమానుల సందడే సందడి. అందరికన్నా ముందే తామే బుక్ చేసుకోవాలనేది వారి తాపత్రయం.

అభిజీత్ కి సినిమా ఆఫర్లు పెద్దగా రావడం లేదు కానీ వెబ్ సిరీస్ ల కోసం ఫిలిం మేకర్స్ వెంట పడుతున్నారట. అలాగే… బ్రాండ్ర్స్, షో రూమ్ ఓపెనింగ్ కి కోసం ఆఫర్లు ఫుల్లుగా వచ్చాయి. కానీ అభిజీత్ ముందు రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాడు. ఆ తర్వాత నింపాదిగా ఈ ఆఫర్ల గురించి ఆలోచిస్తాడు.

32 ఏళ్ల ఈ యువ హీరో… శేఖర్ కమ్ముల తీసిన “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” సినిమాతో గ్లామర్ ప్రపంచంలోకి వచ్చాడు. కానీ హీరోగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ ఫుణ్యమా అని మనీ సంపాదించుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు వెంటపడి ఆఫర్ చేస్తున్న వాటిలో ఎన్ని వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

More

Related Stories