అభిజీత్ కు హారికకు ముడి

Abhijeet and Harika

మొన్నటికిమొన్న అఖిల్ లవ్ ఎఫైర్స్, పెళ్లిపై అతడి తల్లిదండ్రులు స్పందించారు. బిగ్ బాస్ హౌజ్ లో జరుగుతోందంతా డ్రామా అని, బయటకొచ్చిన వెంటనే అఖిల్ కు, ఓ మంచి తెలంగాణ అమ్మాయి సంబంధం చూసి పెళ్లి చేస్తామని ప్రకటించారు.

ఇప్పుడు ఇదే దారిలో అభిజీత్ పెళ్లిపై అతడి తల్లిదండ్రులు స్పందించారు.

హౌజ్ లో రొమాంటిక్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు అభిజీత్. మోనాల్ తో కూడా ఓ రేంజ్ లో కెమిస్ట్రీ పండిస్తున్నాడు. ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై అభిజీత్ తల్లిదండ్రులు రెస్పాండ్ అయ్యారు. అయితే అఖిల్ పేరెంట్స్ కు భిన్నంగా వీళ్లు స్పందించడం విశేషం.

హౌజ్ లో అబిజీత్ కు సరైన జోడీ హారిక అంటున్నారు అతడి తల్లి. వాళ్లిద్దరి మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ చూస్తే ముచ్చటేస్తోందని అంటున్నారు. అభిజీత్-మోనాల్ మధ్య ఏదో ఉందని తను అనుకోవడం లేదని ఆమె చెప్పడం విశేషం.

ఇక అభిజీత్ రియల్ లైఫ్ లవ్ మేటర్స్ విషయానికొస్తే.. అభిజీత్ కు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవంటోంది అతడి తల్లి. నిజానికి అలాంటి ఎఫైర్లు ఏమైనా ఉంటే చెప్పమని తామే అడిగామని, బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లేముందు కూడా ఇదే ప్రశ్న అడిగామని ఆమె అన్నారు. అయితే తను ఎవ్వరితో ప్రేమలో పడలేదని అభిజీత్ స్పష్టంచేశాడట.

More

Related Stories