- Advertisement -

బ్రహ్మానందం, ఆలీ, సునీల్, వెన్నెల కిశోర్, సప్తగిరి, షకలక శంకర్… ఇలా కమెడియన్స్ హీరోగా మారి కొన్ని సినిమాలు చేశారు. కానీ ఏ కమెడియన్ ఇంతవరకు హీరోగా లాంగ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చెయ్యలేదు. అయినా వారి బాటలో నడిచేందుకు సిద్ధం అవుతున్నాడు యువ కమెడియన్ అభినవ్ గోమఠం.
‘ఈ నగరానికి ఏమైంది, ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి సినిమాలు అతనికి మంచి పేరు తెచ్చాయి. ఇప్పుడు అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కాసుల క్రియేటివ్ వర్క్స్ ఈ సినిమా నిర్మిస్తుంది.
జనవరి ఒకటో తేదీ అభినవ్ గోమఠం పుట్టిన రోజు సందర్భంగా సినిమా గురించి ప్రకటన చేశామని నిర్మాతలు చెబుతున్నారు. మిగతా డీటెయిల్స్ త్వరలో చెప్తారట.