సుదీప, అభినయశ్రీ ఇప్పుడు ఇలా ఉన్నారు!

‘నువ్వు నాకు నచ్చావు’ సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా నటించి పాపులర్ అయిన పింకీ సుదీప ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. ఆమె ఇప్పుడు ఇలా ఉన్నారో చూడాలంటే బిగ్ బాస్ తెలుగు 6 షో చూడాలి. ఈ షో ఈ రోజే మొదలైంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు ఈ సారి.

పింకీ సుదీప, అభినయశ్రీ ఇద్దరూ చాలా ఏళ్ల తర్వాత కనిపిస్తున్నారు. అభినయ శ్రీ 15 ఏళ్ల క్రితం ఎంతో క్రేజున్న ఐటెం గాళ్. ‘అ అంటే అమలా పురం’ పాటతో ఆమె అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె కూడా ఈ ఆరో సీజన్ బిగ్ బాస్ లో పాల్గొంటున్నారు.

ఆరోహి రావు, గీతూ రాయల్, శ్రీ సత్య, వాసంతి, కీర్తి భట్, ఇనయ సుల్తానా, నేహా చౌదరి, ఫైమ షేక్, మెరీనా కూడా ఉన్నారు ఫిమేల్ కంటెస్టెంట్ లలో. మొత్తంగా 11 మంది మహిళలు ఈసారి పోటీపడుతున్నారు. వీరిలో అభినయశ్రీ, సుదీప సీనియర్లు.

ఈ సారి గ్లామర్ డోస్ ఎక్కువే ఉంది. కానీ, బాగా పాపులారిటీ ఉన్న వారు లేరు.

 

More

Related Stories