ఇతను హీరో మెటీరియలేనా?

తేజ కొత్త సినిమా అహింస. సురేష్ బాబు చిన్నకొడుకు, రానా తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి ఈ సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు. ఈరోజు సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అస్సలు టీజర్ చూస్తే ఇతను హీరో ఏంటి అనిపిస్తుంది. లుక్స్, నటన రెండూ తక్కువే. సురేష్ బాబు కొడుకు కాకపోతే ఏ దర్శకుడు అతన్ని హీరోగా పెట్టి సినిమా చెయ్యాలనుకోరు. నేపోటిజం అంటే ఇదే.

పేరులో అహింస ఉన్నప్పటికీ, టీజర్ లో చాలా మేరకు హింసనే చూపించారు. టీజర్ మొత్తం తేజ స్టయిల్ లోనే ఉంది. అతడి గత సినిమాలన్నీ గుర్తుకొస్తున్నాయి.

తేజ సినిమాల్లో హీరోలు ఎలా కనిపిస్తారో, అహింసలో అభిరామ్ కూడా అలానే కనిపించాడు.అమాయకపు చూపులతో అభిరామ్ ను ప్రజెంట్ చేసిన దర్శకుడు… టీజర్ రెండో భాగంలో మాత్రం అతడి చేతికి ఓ తుపాకీ అందించాడు. సహజంగా తేజ సినిమాల్లో జరిగేది ఇదే కాబట్టి, ప్రేక్షకులకు పెద్ద ఆశ్చర్యం కలగలేదు.

ఆర్పీ పట్నాయక్ మరోసారి తేజ స్టయిల్ కు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. టీజర్ లో ఫ్రేమ్స్ అన్నీ బాగున్నాయి.

సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోందనే విషయంపై మాత్రమే దృష్టిపెడుతూ టీజర్ ను కట్ చేసినట్టు కనిపిస్తోంది. విడుదల తేదీ లాంటి వివరాల్ని ఇంకా ప్రకటించలేదు.

 

More

Related Stories