ఇలియానా సినిమా కూడా డైరెక్ట్ డిజిటల్

Ileana

అమితాబ్ బచ్చన్ నటించిన “గులాబో సితాబో” నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం మిక్స్ డ్ రెస్పాన్స్ తో నడుస్తోంది. ఇప్పుడు జూనియర్ బచ్చన్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. అభిషేక్ నటించిన ఓ సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతోంది. దాని పేరు “బిగ్ బుల్”.

స్టార్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ బాగా నడుస్తోంది. పైగా అభిషేక్ బచ్చన్ సినిమాలకు థియేట్రికల్ బిజినెస్ కూడా పెద్దగా లేదు. అందుకే ఈ లాక్ డౌన్ టైమ్ లో స్ట్రీమింగ్ కోసం “బిగ్ బుల్” ను ఇచ్చేశారు

డిస్నీ హాట్ స్టార్ సంస్థ ఈ సినిమా రైట్స్ దక్కించుకుంది. త్వరలోనే తమ యాప్ లో స్ట్రీమింగ్ కు పెట్టబోతోంది. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ సినిమాను ఓటీటీకి ఇస్తున్నారనగానే సహజంగా వచ్చే డివైడ్ టాక్ దీనికి రాలేదు. మంచి నిర్ణయమంటూ నెజిజన్లు సమర్థించడం విశేషం. ఈ కంటెంట్ ఓటీటీకే కరెక్ట్ అంటూ రియాక్ట్ అయ్యారు చాలామంది.

అజయ్ దేవగన్ నిర్మించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. అజయ్ దేవగన్ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

 

More

Related Stories