అమితాబ్ హాస్పిటల్ లో చేరలేదు

“బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు గాయమై హాస్పిటల్ లో చేరారంట. శనివారం నుంచి ఆయన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారట.” నిన్నట్నుంచి వినిపిస్తున్న ఈ పుకార్లకు చెక్ పెట్టాడు అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్. తన తండ్రి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, ఎలాంటి పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

“ఈ వార్తలు నేనూ విన్నాను. ఇదే విషయం మా నాన్నను కూడా అడుగుతాను. ఎందుకంటే ఆయన నా ముందే కూర్చొని ఉన్నారు. హాస్పిటల్ ఉన్నారని మీడియా చెబుతున్న వ్యక్తి బహుశా మా నాన్నకు డూప్లికేట్ అయి ఉండొచ్చు.” ఇలా సెటైరిక్ గా పుకార్లపై స్పందించాడు అభిషేక్ బచ్చన్.

కొన్ని రోజుల కిందట బచ్చన్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమితాబ్ భార్యకు తప్ప మిగతా అందరికీ పాజిటివ్ వచ్చింది. ఆ వైరస్ నుంచి త్వరగానే కోలుకున్న బిగ్ బి, వెంటనే తన షూటింగ్స్ తో బిజీ అయిపోయారు. ఈలోగా ఆయన మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడంటూ పుకార్లు రావడంతో అభిషేక్ వెంటనే రియాక్ట్ అయ్యాడు. 

Related Stories