బార్లు తెరిచారు, థియేటర్లు చేయకూడదా?

Cinema Halls

కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. కానీ కరోనాతో కలిసి బతకడం నేర్చుకోవాలంటూ దేశంలోనే ప్రభుత్వాలు అన్నింటిని ఓపెన్ చేస్తున్నాయి. స్కూల్స్, కాలేజులు, థియేటర్లు తప్ప దాదాపు అన్ని వ్యాపారాలు, సంస్థలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణాలో బార్లుకు కూడా అనుమతి ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్.

జనం కూడా మామూలు స్థితికి వస్తున్నారు. మరి థియేటర్లు ఓపెన్ చేస్తే వచ్చే నష్టం ఏంటి అనేది ప్రశ్న. ఇదే డౌట్ దర్శకుడు నాగ్ అశ్విన్ కి కూడా వచ్చింది. “నేను సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తాను. కానీ… బార్లు, జిమ్ లు, రెస్టారెంట్లు, గుళ్ళు, బస్సులు, ట్రైన్లు, మాల్స్, ఫ్లైట్స్….అన్ని ఓపెన్ అయ్యాయి. ఇక థియేటర్లు కూడా అనుమతి ఇవ్వాల్సిన టైం వచ్చింది. మాస్క్ వేసుకొని సినిమాలు ఎలా చూడాలో ఆలా చూసేందుకు నేను రెడీ,” అంటూ ట్వీటాడు నాగ్ అశ్విన్.

మరి నాగ్ అశ్విన్ మాటని ప్రభుత్వాలు పట్టించుకుంటాయా. పశ్చిమ బెంగాల్ లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం… థియేటర్ లో ఓక షోకి 50 మంది మించకుండా రన్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఐతే… ఎంతవరకు జనం వస్తారు అనేది చూడాలి.

Related Stories