అన్నయ్యతో భాయ్ ఫైట్

Radhe and Acharya movie posters

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ మే 13న విడుదల కానుంది. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ… వెరీ బిగ్ కాంబినేషన్. ఈ సినిమాని తెలుగుతో పాటు ఇతర భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేద్దామనుకుంటున్నారు. ఎందుకంటే, ఇది మెగా మల్టీస్టారర్ మూవీ కాబట్టి. తెలుగు వర్షన్ వరకు ఈ సినిమాకి పోటీ అనేది ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు పరంగా కుమ్మేస్తుంది.

కానీ, భాయ్ సల్మాన్ ఖాన్ రూపంలో అన్నయ్యకి నార్త్ ఇండియా మార్కెట్ లో దెబ్బ పడనుంది. “పండక్కి వస్తాను అని మాట ఇచ్చాను…అన్నట్లే పండక్కి వస్తున్నా… ఎందుకంటే నేను ఒకసారి మాట ఇస్తే..” అని డైలాగ్ విసురుతూ సల్మాన్ ఖాన్ తన “రాధే” రిలీజ్ డేట్ ప్రకటించాడు. “రాధే” కూడా మే 13న థియేటర్లో విడుదల కానుంది.

అంటే.. “ఆచార్య” సినిమా రెవెన్యూలో కొంత కోత పెడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూర్, ముంబై, ఇతర మెట్రో నగరాల్లో “ఆచార్య”కి మల్టీప్లెక్సుల్లో స్క్రీన్ లు తగ్గుతాయి.

More

Related Stories