ఆచార్య: మిగిలిన భాగం చిత్రీకరణ

Acharya


మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ రెండున్నరేళ్ల క్రితం మొదలుపెట్టిన “ఆచార్య” ఇంకా గుమ్మడికాయ కొట్టలేదు. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు దర్శకుడు శివ కొరటాల. ఈ సినిమాకి సంబందించిన రెండు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఇప్పుడు వాటిని తీస్తున్నారు.

రామ్ చరణ్, చిరంజీవిలపై మిగిలిన ఒక పాటని ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు. అలాగే, ఇంకో పాటని కాజల్, చిరంజీవిపై తీస్తారు. దాంతో, సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొడుతారన్నమాట.

ఐతే, విడుదల విషయంలో క్లారిటీ రావడం లేదు. సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉంది. కాకపొతే అందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించాలి. ఆయన ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరిలో ఉంది.

‘ఆచార్య’ షూటింగ్ పూర్తి కాగానే దర్శకుడు శివ కొరటాల ఎన్ఠీఆర్ మూవీ వర్క్ స్టార్ట్ చేస్తారు.

 

More

Related Stories