
‘ఆచార్య’ సినిమా వాయిదా పడనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా నిర్మాతలు అధికారికంగా ఒక ప్రకటన చేశారు. ముందు ప్లాన్ చేసినట్లే… ఖమ్మం షెడ్యూల్ పూర్తి అయిందని తెలిపారు. సినిమా వాయిదా అన్న వార్తల్లో నిజం లేదన్నట్లుగా ప్రెస్ నోటు వచ్చింది.
హడావిడిగా చిరంజీవి హైదరాబాద్ కి రావడంతో ఈ ప్రచారం మొదలైంది. ఆయనకు హెల్త్ బాలేదని, అందుకే ఖమ్మంలో షూటింగ్ ని అర్ధాంతరంగా ముగిసిందనేది ఈ వార్తల సారాంశం. ఎండలు బాగా ముదిరాయి. ఈ టైంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో షూటింగ్ ప్లాన్ చెయ్యడమే తప్పు. సాధారణంగా కోల్ బెల్ట్ ఏరియాల్లో ఎండలు ఎక్కువ ఉంటాయి.
“`ఖమ్మం షెడ్యూల్ ని ఎలాంటి ఆటంకాల్లేకుండా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి తిరిగి హదరాబాద్ లో అడుగుపెట్టాం. చిరంజీవి – చరణ్ పై కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించాం“ అని తెలిపారు నిరంజన్ రెడ్డి. అంతేకాదు ఈ సినిమా మే 13న థియేటర్లలోకి రానుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు.