
మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడంతో… “ఆచార్య” సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మరోసారి మారిపోయాయి. ఈ సినిమా సమ్మర్ 2021కి విడుదల చెయ్యాలనేది ప్లాన్. కానీ అది సాధ్యం కాదు అనిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ఇంట్లో ఉండి కరోనాకి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన త్వరగానే కోలుకోవడం ఖాయం. ఎందుకంటే మెగాస్టార్ చాలా హెల్త్ లైఫ్ స్టయిల్ లీడ్ చేస్తారు. ఇతర సమస్యలు కూడా లేవని అంటున్నారు.
ఆయన ఎంత త్వరగా కోలుకున్నా… ఈ నెలలో మళ్ళీ షూటింగ్ సెట్ లోకి రాలేరు. డిసెంబర్ నుంచి షూటింగ్ మొదలు పెడుతారా లేదా జనవరి నుంచా అన్నది చూడాలి. ఇప్పటి పరిస్థితిని బట్టి చూస్తే “ఆచార్య” సినిమా సమ్మర్ బరిలో నిలవడం కష్టమే.
“ఆచార్య”లో మెగాస్టార్ చిరంజీవిది ప్రొఫెసర్ పాత్ర. ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఆమె ఇప్పుడు భర్తతో కలిసి హనీమూన్ ట్రిప్పులో ఉంది. ఇక రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడు కొరటాల శివ.