ఆచార్య మిస్, విశ్వంభరకి ఎస్

Trisha

మెగాస్టార్ చిరంజీవి సరసన మరోసారి నటిస్తోంది అందాల త్రిష. అప్పుడెప్పుడో “స్టాలిన్” చిత్రంలో చిరంజీవికి ప్రియురాలిగా కనిపించిన త్రిష ఇన్నేళ్ల తర్వాత ఆయనతో జతకడుతోంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న “విశ్వంభర” చిత్రంలో ఆమె కథానాయిక. ఈ రోజు నుంచి షూటింగ్లో పాల్గొంటోంది.

ఐతే ఆమె చిరంజీవితో “ఆచార్య”లో నటించాలి. ఆమె సినిమా చేసేందుకు సంతకాలు కూడా చేసింది. ఆమె పేరుని కూడా ప్రకటించారు. ఐతే, “ఆచార్య” సినిమా విషయంలో పారితోషికం విషయంలోనో, మరే విషయంలోనో ఆమెకి వర్కవుట్ కాలేదు. సో, ఆమె సినిమా చెయ్యలేదు. ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను అని ఆమె ట్విట్టర్లో అప్పుడు పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఆమె స్థానంలో కాజల్ ని తీసుకున్నారు. చివరికి కాజల్ తో తీసిన సీన్లు కూడా సినిమాలో పెట్టకుండా చిరంజీవికి హీరోయిన్ గా ఎవరూ జోడిగా లేకుండా విడుదల చేశారు. సినిమా ఘోరంగా పోయింది.

ఇక ఇప్పుడు ఏరికోరి త్రిషను తీసుకున్నారు. మెగాస్టార్ వయసుకు తగ్గట్లు మెచ్యూర్డ్ హీరోయిన్ ని తీసుకోవాలనే ఉద్దేశంతో 40 ఏళ్ల త్రిషను తీసుకున్నారు.

ఆమె కూడా “ఇంటికి” వచ్చినంత ఆనందంగా ఉంది అని పేర్కొంది.

Advertisement
 

More

Related Stories