ఆచార్య… ఈ ఫోటో వైరల్

Acharya

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మూవీ… ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ఈస్ట్ గోదావరి జిల్లా మారేడుమిల్లి, యెళ్ళెందు (ఖమ్మం) ప్రాంతాల్లో జరుగుతోంది. నక్సలిజం నేపథ్యంలో సాగే సన్నివేశాలు తీస్తున్నారు. షూటింగ్ చూడ్డానికి వచ్చిన లోకల్ జనం ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తున్నారు.

యెళ్ళెందు ఓపెన్ కాస్ట్ గనుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఈ నెలాఖరుకి కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అవుతుంది. మే 13న విడుదల కానున్న ‘ఆచార్య’లో రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. పూజ హెగ్డే, చరణ్ పై ఒక సాంగ్ కూడా తీశారు. మణిశర్మ కంపోజ్ చేసిన తొలి సాంగ్ ఈ నెలాఖర్లో విడుదల అవుతుంది.

More

Related Stories