బూతులు మాట్లాడుతున్న ఓటిటి స్టార్స్

ఒటిటి ప్లాట్ ఫార్మ్ కోసం తీసే సినిమాలు, వెబ్ డ్రామాల్లో శృతి మించిన బూతులు ఉంటున్నాయి అని చాలాకాలంగా విమర్శలున్నాయి. మొదట్లో కిస్ సీన్లతో, సెక్స్ సీన్లు పెట్టి జనాల్ని అట్రాక్ట్ చేశారు. తర్వాత జనం వాటిని పట్టించుకోవడం మానెయ్యడంతో ఇప్పుడు బోల్డ్ పేరుతో విచ్చలవిడిగా బూతు మాటలు వాడుతున్నారు. “లం..”, “లం ..కొ …”, “ఎర్రి….”, “గు..” ఇలాంటి మాటలు ఆడా,మగ అన్ని క్యారెక్టర్లు వాడేస్తున్నాయి డైలాగుల్లో.

మొన్న ఒక సినిమా విడుదలైంది. “మా వింత‌గాధ వినుమా” ఆ సినిమాలో నటించిన హీరో సిద్ధూ … తెలుగులో ఉన్న అన్ని బూతు డైలాగులను సెన్సార్ లేకుండా వాడేశాడు. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఒక బూతు మాటని అదే సౌండింగ్ లో వినిపించేలా వేరే పదాలతో వాడుతూ వచ్చారు. కానీ సిద్ధూ ఆ బూతు పదాన్ని యాజిటీజ్ గా వాడేశాడు. ఈ సినిమా “ఫాదర్ అఫ్ తెలుగు ఒటిటి” అల్లు అరవింద్ నిర్వహిస్తున్న దాంట్లోనే స్ట్రీమ్ అవుతోంది.

లేటెస్ట్ గా హీరోయిన్ తేజస్వి కూడా బూతులు వాడుతోంది. తాజాగా విడుదలైన “కమిట్ మెంట్” అనే సినిమా టీజర్లో “లం” మాట యూజ్ చేసింది. రియల్ లైఫ్ లో కూడా చాలామంది ఆవేశంలో బూతులు మాట్లాడుతారు. కానీ రియాలిటీ పేరుతో అన్నింటిని ఇలా సెన్సార్ లేకుండా చూపిస్తారా?

Related Stories