నటుడు కడలి జయసారధి కన్నుమూత

సీనియర్ నటుడు కడలి జయసారధి కన్నుమూశారు. ఆయనకి 83 ఏళ్ళు. ఆయన 300కి పైగా చిత్రాలలో నటించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ లోని ఆ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు.

ఆయన తొలి చిత్రం…. 1960లో విడుదలైన ‘సీతారామ కళ్యాణం’. అప్పట్లో హాస్యనటుడిగా పేరొందారు.

‘భక్త కన్నప్ప’, ‘మనవూరి పాండవులు’, ‘మెరుపు దాడి’ వంటి చిత్రాలు ఆయనకి పేరు తెచ్చాయి. నటుడిగానే కాదు నిర్మాతగా కూడా ఆయన చిరపరిచితమే.

చెన్నై నుంచి హైదరాబాద్ కి చిత్రసీమ తరలిరావడంలో జయసారధి కృషి కూడా ఉంది.

 

More

Related Stories