రేప్ కేస్: కృష్ణుడి క్లారిఫికేషన్

నల్గొండకు చెందిన ఓ యువతి తనపై 140 మంది అత్యాచారం చేశారంటూ ఫిర్యాదుచేసిన కేసులో యాంకర్ ప్రదీప్ పేరుతో పాటు నటుడు కృష్ణుడు పేరు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రదీప్ వివరణ ఇచ్చాడు. ఇప్పుడీ కేసుపై కృష్ణుడు రియాక్ట్ అయ్యాడు. ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు.

తను ఎవ్వర్నీ కలవలేదని, ఎవ్వరికీ అన్యాయం చేయలేదంటున్నాడు కృష్ణుడు. ఆమధ్య నల్గొండ నుంచి ఓ యువతి ఫోన్ చేసిందని.. అయితే ఆమె మాటతీరు అనుమానాస్పదంగా ఉండడంతో కాల్ కట్ చేసి, ఆ వెంటనే బ్లాక్ కూడా చేశానంటున్నాడు కృష్ణుడు.

త్వరలోనే పోలీసుల్ని కలిసి ఈ కేసుకు సంబందించి వివరణ ఇస్తానని, తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేసిన ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తానంటున్నాడు.

సినిమా అవకాశం కోసం తనను సదరు యువతి కలిస్తే.. ఆ యువతిని తనే ఓ యాంకర్ కు పరిచయం చేశానంటూ తాజాగా విడుదలైన ఆడియో టేపును కృష్ణుడు ఖండించాడు. యాంకర్ ప్రదీప్ ఎవ్వరో తనకు తెలియదంటున్నాడు. ప్రదీప్ ను టీవీల్లో చూడ్డమే తప్ప, ఆయనతో తనకు ఎలాంటి పరిచయం లేదంటున్నాడు.

మొన్నటివరకు ప్రదీప్ నంబర్ కూడా తన దగ్గర లేదని, ఈ కేసు బయటకొచ్చిన తర్వాత కొంతమందిని అడిగి ప్రదీప్ నంబర్ తీసుకున్నానని, కానీ తెలియని నంబర్ కావడంతో ప్రదీప్ తన కాల్ లిఫ్ట్ చేయలేదంటున్నాడు.

Related Stories