నటుడు రాజబాబు కన్నుమూత

- Advertisement -

పలు చిత్రాల్లో నటించిన నటుడు రాజబాబు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకి 64 ఏళ్ళు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేట ఆయన స్వస్థలం.

60కి పైగా సినిమాల్లో నటించారు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘శ్రీకారం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘భరత్ అనే నేను’ వంటి చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. ఎక్కువగా సహాయ నటుడిగా చిన్న చిన్న పాత్రలు పోషించారు.

టీవీ సీరియల్స్ లో కూడా కీలకమైన పాత్రలు పోషించారు.. ‘వసంత కోకిల’, ‘మనసు మమత’, ‘చి ల సౌ స్రవంతి’ వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పించారు. 2005లో ‘అమ్మ’ సీరియల్‌ ఆయనకి బుల్లితెర నంది అవార్డు తెచ్చిపెట్టింది.

 

More

Related Stories