శ్రీవిష్ణుకి రిలీఫ్ వచ్చినట్లే!

Sree Vishnu

హీరో శ్రీ విష్ణు మంచి టాలెంటెడ్ హీరో. కామెడీ టైమింగ్ ఉన్న హీరో. నటన కూడా సహజంగా ఉంటుంది. ఐతే, ‘రాజరాజ చోర’ సినిమా తర్వాత విజయాలు ఆగాయి. చేసిన సినిమాలు అన్ని బోల్తా కొట్టాయి. యాక్షన్ రోల్స్, పోలీస్ పాత్రలు అంటూ కొన్ని ప్రయోగాలు చేసిన శ్రీ విష్ణుకి చేదు అనుభవాలే మిగిలాయి.

దాంతో, అతని సినిమాల మార్కెట్ తగ్గింది. హిట్ కొట్టాల్సిన అవసరం వచ్చింది. సరిగ్గా ఈ టైంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైంది “సామజవరగమన”. పూర్తిగా శ్రీ విష్ణుకి కొట్టిన పిండిలాంటి సినిమా. కామెడీ చిత్రం. దాంతో, అతని సత్తా ఏంటో మరోసారి తెలిసింది.

క్రిటిక్స్ అందరూ మంచి రేటింగ్ ఇచ్చారు. సినిమాకి కూడా మౌత్ టాక్ బాగుంది. అమెరికాలో మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగునాట స్లోగా పికప్ అవుతోంది. ఈ సినిమా వసూళ్ల కన్నా శ్రీ విష్ణుకి పెద్ద రిలీఫ్ సినిమా బాగుంది అన్న టాక్ రావడం. అలాంటి మాట కోసమే శ్రీవిష్ణు వేచి చూస్తున్నాడు. ఈ సినిమా అతనికి పెద్ద రిలీఫ్.

ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి పెద్ద సంస్థ తీస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ‘రాజరాజ చోర’ డైరెక్ట్ చేసిన హసిత్ గోలి ఈ సినిమాకి దర్శకుడు. దీంతో మంచి హిట్ కొట్టేలా ప్లాన్ వేశాడు. పైగా పెద్ద సంస్థ తీస్తున్న చిత్రం కాబట్టి ప్రమోషన్ కూడా గట్టిగా చేస్తారు. సో, కరెక్ట్ టైంలో ఆయనకి కరెక్ట్ సినిమా పడింది. ఊపిరి పీల్చుకునేలా చేసింది.

Advertisement
 

More

Related Stories