65 దాటినా షూటింగ్లో పాల్గొనొచ్చు

Amitabh Bachchan


సీనియర్ నటులకు గుడ్ న్యూస్!

65 దాటిన నటులు, సాంకేతిక నిపుణులు సినిమా షూటింగ్లో పాల్గొనకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిబంధన అర్ధరహితమని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. కోవిద్ 19 నేపథ్యంలో మహారాష్ట్ర ఈ నిబంధన తెచ్చింది… అదే రూల్ ని మన తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఇంప్లీమెంట్ చేస్తున్నాయి. షూటింగులకు అనుమతి ఇస్తూనే ఈ నిబంధన పెట్టడం… మా పొట్ట కొట్టడమే అని కొందరు సీనియర్ నటులు అక్కడి కోర్టును ఆశ్రయించారు. ఈ రోజు తుది తీర్పు ఇచ్చింది.

అంటే… అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి సీనియర్ నటులకి ఇక ఈ ఇబ్బంది ఉండదు… షూటింగ్లో పాల్గొనచ్చు. ఐతే… కరోనా సేఫ్టీ నియమాలు మాత్రం పాటించాల్సిందే.

77 ఏళ్ల అమితాబ్ ఇటీవలే కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పట్లో ఆయన షూటింగ్ లో పాల్గొనే రిస్క్ తీసుకోరు. ఇక ఈ నెల 22న 65వ బర్త్ డే జరుపుకునే మెగాస్టార్ చిరంజీవి… “ఆచార్య” షూటింగ్ ని నిలిపివేశారు. హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గాకే… మెగాస్టార్ మళ్ళీ షూటింగ్ షురూ చేస్తారు. 69 ఏళ్ల రజినీకాంత్ “అన్నత్థే” అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ షూటింగ్ కూడా ఆగింది. ఆయన కూడా ఇప్పట్లో షూటింగ్ లొకేషన్ లోకి వెళ్లేందుకు ఇష్టపడరు. కమల్ హాసన్ కి 65 ఏళ్ళు. కమల్ నటిస్తోన్న “భారతీయుడు 2” షూటింగ్ చాలా నెలలుగా ఆగింది.

Related Stories