రైడ్ లో దొరికిందెవరో తెలిస్తే షాకవుతారు!

హెడ్డింగ్ చూస్తే… వ్యూస్ కోసం ఇలాంటి థంబ్ నెయిల్స్ పెట్టె యూట్యూబ్ ఛానెల్ గుర్తొస్తోంది కదూ! కానీ ఈ న్యూస్ కి ఇదే హెడ్డింగ్ కరెక్ట్.

ముంబైలో ఎన్సీబీ (నారాకోటిక్స్ కంట్రోల్ బ్యూరో) చేసిన రైడ్ లో ఒక టాలీవుడ్ నటి పట్టుబడింది అనే వార్త నిన్న కలకలం రేపింది. ఆమెకి, ఒక డ్రగ్స్ ముఠాకి సంబంధం ఉందని ఆదివారం నుంచి టీవీల్లో, సోషల్ మీడియాల్లో, వెబ్ సైట్ లలో ఒకటే వార్తలు. ఆ టాలీవుడ్ నటి ఎవరు అనే విషయంలో రకరకాల ఊహాగానాలు రేగాయి.

సోమవారం ఆ నటి ఎన్సీబీ ఆఫీస్ కి వచ్చింది. విచారణకు హాజరైంది. ఆమె ఎవరో తెలిసింది. తీరా చూస్తే ఆమె నటించిన తెలుగు సినిమాలేంటి అని గూగుల్ చేస్తే కూడా సమాధానం రావట్లేదు. అంతటి అనామక హీరోయిన్ ఆమె. టాలీవుడ్ భామ అనగానే ఎంత పాపులర్ నటో అని అందరూ అనుకున్నారు. కానీ ఫేస్ కి చున్నీ కప్పుకొని… మీడియా ముందుకు వచ్చిన ఈ నటి పేరు ఏంటో తెలిసింది. ఆమె పేరుతో మనం గూగుల్ లో సెర్చ్ చేస్తే ఆమె నటించిన తెలుగు సినిమాల లిస్ట్ రావడం లేదు.

ఏవో కొన్ని చిన్న చిన్న చిత్రాల్లో నటించి ఉంటుంది. అందుకే, ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవుతారు అన్నది.

More

Related Stories