- Advertisement -

సీనియర్ నటి కవిత ఇంట్లో మరో విషాదం. ఇటీవలే ఆమె తన కుమారుడిని కోల్పోయారు. ఇప్పుడు ఆమె భర్త కూడా కన్నుమూశారు. ఇద్దరూ కరోనాకి బలి.
కరోనాతో పోరాడుతూ ఆమె భర్త దశరథ రాజు బుధవారం చెన్నైలో కన్నుమూశారు. 15 రోజుల క్రితం ఆమె కొడుకు స్వరూప్ కూడా కరోనాకి చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు.
సినిమా ఇండస్ట్రీలో కరోనా బాధితులు చాలామందే ఉన్నారు కానీ కవిత ఇంట్లో కల్లోలం అందరిని కలిచివేస్తోంది. హీరోయిన్ గా, క్యారెక్టర్ నటిగా అనేక చిత్రాల్లో నటించిన కవిత తన భర్త, కుమారుడిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.