‘ఏక్ మినీ కథ’ హీరోయిన్ అరెస్ట్

- Advertisement -
Kavya

తెలుగులో ఇటీవల విడుదలైన ‘ఏక్ మినీ కథ’ అనే సినిమాలో నటించిన కావ్య థాపర్ అరెస్ట్ అయింది. ముంబై పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ లో ఉంచారు.

26 ఏళ్ల ఈ సుందరి గురువారం రాత్రి తాగి కారు నడపడమే కాకుండా రోడ్డు మీద ఆగి ఉన్న ఒక వెహికిల్ ని గుద్దింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపిన వ్యక్తిని ఆమె బండ బూతులు తిట్టిందట. అంతే కాదు మద్యం మత్తులోనే అతన్ని కొట్టేందుకు వెళ్లిందట. దాంతో, పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

కావ్య థాపర్ చాలా కాలంగా సినిమాల్లో నటిస్తోంది. కానీ ‘ఏక్‌ మినీ ప్రేమకథ ‘ కాస్త గుర్తింపుని ఇచ్చింది.

అందాలు ఆరబోయడంలో సంకోచం లేని ఈ సుందరికి ఆ సినిమా తర్వాత మరో ఆఫర్ రాలేదు.

 

More

Related Stories