సాయి సుధలో ఈ కోణముందా?

నటి సాయి సుధ గుర్తుందా.. సినిమాల్లో చేసిన పాత్రల కంటే ఆమధ్య వెలుగులోకి వచ్చిన ఓ వివాదంతోనే ఈమె బాగా పాపులర్ అయింది. కెమెరామేన్ శ్యామ్ కె.నాయుడు తనను మోసం చేశాడంటూ ఆమె సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసు ఇంకా నడుస్తోంది.

ఇప్పుడు సాయిసుధ మరో కోణంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

రీసెంట్ గా రవిబాబు తను తీస్తున్న ‘క్రష్’ సినిమా ట్రయిలర్ వదిలాడు. ఇందులో సాయిసుధకు కూడా ఓ క్యారెక్టర్ ఇచ్చాడు. అయితే ఇది అలాంటిలాంటి క్యారెక్టర్ కాదు. మాంఛి మసాలా దట్టించిన పాత్ర. ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాల్లో నటించినప్పటికీ.. ఇప్పటివరకు ఎవ్వరూ సాయిసుధను ఇంత హాట్ గా, ఎరోటిక్ గా చూపించలేకపోయారు మరి.

సాయిసుధతో లిప్ కిస్సులు, బెడ్ రూమ్ షాట్స్ మాత్రమే కాదు.. ఏకంగా కొన్ని శృంగార కోణాల్ని కూడా చూపించాడు దర్శకుడు. ఈ సినిమా దెబ్బతో సాయిసుధకు నటిగా ఓ సరికొత్త హాట్ ఇమేజ్ వస్తుందని, ఆమె కెరీర్ కొత్త మలుపు తిరుగుతుందని సోషల్ మీడియాలో అప్పుడే చర్చ మొదలైంది. అన్నట్టు ట్రయిలర్ లోంచి సాయిసుధ స్క్రీన్ షాట్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

మొత్తానికి సాయిసుధ అందాల్ని, ఆమె టాలెంట్ ను రవిబాబు బాగానే ‘క్రష్’ చేశాడు.

Related Stories