శాంతించిన శివపార్వతి

తనకు కరోనా సోకితే కనీసం ఒక్కరు కూడా పలకరించలేదంటూ ఆవేశంతో ఊగిపోయిన శివపార్వతి శాంతించారు. తను చేస్తున్న సీరియల్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి స్పందన లేదంటూ తను పర్సనల్ గా ఓ వీడియో పెడితే.. అది యూట్యూబ్ లో ప్రత్యక్షమైందని.. కొందర్ని మనస్తాపానికి గురిచేసిందని చెప్పుకొచ్చిన శివపార్వతి.. ఎవ్వరూ మరోలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.

“నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని నాకు తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు. అయితే నేను దారుణమైన పరిస్థితుల్లో లేను. నేను బాగానే ఉన్నాను. ఛానెల్స్ లో చెప్పినట్టు నేను చావుబతుకుల్లో లేను. దేవుడి దయవల్ల నాకు ఆర్థిక సమస్యల్లేవు. నేను బాగున్నాను. బాగానే కోలుకుంటున్నాను.”

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు, పరుచూరి బ్రదర్స్ తనతో టచ్ లోనే ఉన్నారని అంటున్నారు శివపార్వతి. ఒకరికొకరం కష్టసుఖాలు చెప్పుకుంటున్నామని, అంతా బాగానే ఉందని చెప్పుకొచ్చారు.

తను వర్క్ చేస్తున్న ప్రొడక్షన్ హౌజ్ నుంచి సరైన స్పందన లేదని ఓ పర్సనల్ వీడియో పెడితే.. వేర్వేరు టైటిల్స్ తో దాన్ని యూట్యూబ్ లో పెట్టేశారని శివపార్వతి ఆవేదన వ్యక్తంచేశారు. కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి పలకరించలేదనే బాధతో, కేవలం మోరల్ సపోర్ట్ కోసం ఆ వీడియో పెట్టాను తప్ప.. దుర్భర  పరిస్థితుల్లో తను లేనని క్లారిటీ ఇచ్చారు శివపార్వతి.

Related Stories