నటి ‘వనిత’పై దాడి

Vanitha Vijaykumar

ఇటీవలే “మళ్ళీ పెళ్లి” అనే సినిమాలో విలన్ తరహా పాత్ర పోషించారు నటి వనిత విజయ్ కుమార్. ఈ తమిళ నటికి వివాదాలు కొత్త కాదు. తరుచుగా వార్తల్లో ఉంటారు. ఇప్పుడు ఆమెపై దాడి జరిగింది.

ఒక ఆగంతుకుడు తనపై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చడని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ చేసిన ఫోటో చేస్తే ఆమె ముఖంపై తీవ్ర గాయం అయింది. ఆ దాడి చిన్నది కాదు. కానీ ఆమె పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదు. న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదు,” అనే ఆమె పేర్కొన్నారు.

తమిళ బిగ్ బాస్ 7లో పాల్గొంటున్న ఒక కంటిస్టెంట్ మద్దతుదారుడు తనపై గాయం చేశాడనేది ఆమె ఆరోపణ.

ప్రముఖ నటులు విజయ్ కుమార్ (“ఖుషి”లో భూమిక తండ్రి) ఆయన రెండో భార్య మంజుల మొదటి కూతురు వనిత. “దేవి”, “మళ్ళీ పెళ్లి” వంటి తెలుగు సినిమాల్లో నటించిన వనిత తమిళనాడులో బాగా పాపులర్. మూడు సార్లు పెళ్లిళ్లు చేసుకొని సంచలనం సృష్టించారు. “బిగ్ బాస్ తమిళ్ 3″లో కూడా పాల్గొన్నారు.

Advertisement
 

More

Related Stories