వేరే హీరోయిన్లలా ఆ పని చెయ్యను

Adah

అదాశర్మ… ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు. అప్పుడెప్పుడో ఆరేళ్ల కిందటే మొదలైంది. చూడ్డానికి అందంగా ఉంటుంది, గ్లామర్ పండించడానికి మొహమాటపడదు. అయినప్పటికీ తెలుగు నుంచి ఈమెకు అవకాశాలు అంతంతమాత్రంగానే వస్తున్నాయి.

ఈ ఆరేళ్లలో అదా చేసిన సినిమాలు చాలా తక్కువ. మరి దీనికి రీజన్ ఏంటి?

తనకు ఎందుకు టాలీవుడ్ నుంచి అవకాశాలు రావడం లేదో అదా చెప్పుకొచ్చింది. టాలీవుడ్ తో ఆమెకు కనెక్షన్లు తక్కువగా ఉన్నాయట. పైగా ఇక్కడ పార్టీలకు ఆమె వెళ్లలేదట, ఎవ్వర్నీ కలవలేదట. ఈ కారణాల వల్లనే తనకు అవకాశాలు తగ్గిపోయాయని అంటోంది అదా.

దీంతో పాటు గతంలో కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందంటూ వచ్చిన కొన్ని ఆఫర్లను రిజెక్ట్ చేయడం కూడా ఓ కారణంగా చెప్పుకొచ్చింది. కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందనే కారణంతో, తన క్యారెక్టర్ కు వెయిట్ లేని పాత్రలు చేయనని.. తెలుగు నుంచి తనకు అవకాశాలు రావడానికి అది కూడా ఓ కారణమని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం తెలుగులో “?” (క్వశ్చన్ మార్క్) అనే సినిమా చేసింది అదా.

Related Stories