కరోనా వస్తే, అతన్ని మార్చేశారట

నటుడు ఆదర్శ్ బాలకృష్ణకి కరోనా వచ్చింది. అతనికే కాదు ఇంట్లో ఉన్న అందరికి కరోనా సోకింది. ఆయన తల్లితండ్రులను ఆసుపత్రిలో చేర్పించాడు. ఇదే విషయాన్ని తాను నటిస్తున్న ఒక సినిమా యూనిట్ కి తెలిపాడట. ఐతే, ఆదర్శ్ బాలకృష్ణ చెయ్యాల్సిన ఆ పాత్ర నుంచి అతన్ని తొలగించి ఆ స్థానంలో ఇంకో నటుడ్ని తీసుకున్నారట సదరు సినిమా టీం.

ఆయన ప్లేస్ లో ఇంకొకర్ని తీసుకుంటున్న విషయాన్ని కూడా సదరు దర్శక, నిర్మాతలు ఆదర్శ్ కి తెలపలేదట. సినిమా ఇండస్ట్రీలో చిన్న నటుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియచేసే సంఘటన ఇది. ఈ విషయాన్ని ఆదర్శ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

పెద్ద హీరోలు, హీరోయిన్ల కోసం సినిమా నిర్మాతలు వెయిట్ చేస్తారు. చిన్న నటుల విషయంలో అలాంటిది ఉండదు. ప్రాక్టికల్ గా చెప్పాలంటే… చిన్న నటులపై ఎక్కువ పోర్షన్ షూట్ చెయ్యకపోయినా, లేదంటే ఇంకా షూట్ చెయ్యకపోయినా దర్శక, నిర్మాతలకు పెద్ద ఆప్సన్ కూడా ఉండదు. ఎందుకంటీ వీరి కోసం హీరో, హీరోయిన్లు డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేరు. సో… వేరే నటులను రీప్లేస్ చెయ్యక తప్పదు. కాకపోతే, ఆ నటులకు కనీసం ఇంటిమేట్ చెయ్యాలి.

More

Related Stories