ఈ ఫొటోతో క్లారిటీ వచ్చింది!


అడవి శేష్ మంచి అందగాడు. మంచి సక్సెస్ లో ఉన్నాడు. ‘మేజర్’ సినిమాతో ఇండియా అంతా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక, ఈ ఏడాది (2022) రెండు హిట్లు అందుకున్న హీరో. ‘మేజర్’, ‘హిట్ 2’ సినిమాలతో అతని స్థాయి పెరిగింది.

కెరీర్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా అడవి శేష్ జీవితంలో మంచి సందడి ఉంది. అతను కొంతకాలంగా అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నాగార్జున మేనకోడలు సుప్రియతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే, ఇవి రూమర్స్ మాత్రమే అన్నట్లుగా శేష్ వాటి గురించి పెదవి విప్పలేదు ఇప్పటివరకు.

ఐతే, తాజాగా హీరో సుశాంత్ తమ క్రిస్మస్ పార్టీ సంబరాలతో వీరి గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు. అక్కినేని గ్రాండ్ చిల్డ్రన్ జరుపుకున్న క్రిస్మస్ పార్టీకి సుశాంత్, సుమంత్, అఖిల్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ ఫ్రేమ్ లో ‘అక్కినేని’ ఫ్యామిలీకి సంబంధం లేని ఒకే ఒక్క వ్యక్తి అడవి శేష్. సుప్రియ సరసన నిల్చొని ఉన్నాడు ఈ ఫొటోలో.

దాంతో, వీరు తమ డేటింగ్ గురించి క్లారిటీ ఇచ్చినట్లే అని సోషల్ మీడియా టాక్. సుప్రియకి 44 ఏళ్ళు. శేష్ కి 38. ఆమెకి ఇంతకుముందే పెళ్లి, విడాకులు జరిగాయి.

 

More

Related Stories