వెనక్కి లేదు, ముందుకు లేదు!

Adipurush


‘ఆదిపురుష్’ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకొంది అని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే కొన్ని సినిమాల ప్రకటనలు వచ్చాయి. అఖిల్ నటిస్తోన్న ‘ఏజెంట్’ సినిమాని కూడా సంక్రాంతి రేసులో నిలుపుతున్నట్లు ఉన్నట్లుండి ఆ సినిమా నిర్మాతలు ప్రకటించడంతో ‘ఆదిపురుష్’ తప్పుకుందనే వాదన బలపడింది.

చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, బాలయ్య ‘వీర సింహ రెడ్డి’, విజయ్ ‘వారసుడు’తో పాటు అఖిల్ మూవీ కూడా సంక్రాంతి బరిలోకి దిగింది అంటే ‘ఆదిపురుష్’ లేనట్లే కదా అని అందరూ అనుకున్నారు.

కానీ, ఈ వార్తలను నిర్మాతలు తోసిపుచ్చుతున్నారు. ‘ఆదిపురుష్’ జనవరి 12న విడుదల అవుతుంది, ఆ డేట్ లో మార్పు లేదనేది వారి మాట. ఒక వారం ముందుకు వెళ్లడమో, వెనక్కి వెళ్లడమో అనేది లేదంట. ముందు చెప్పినట్లే సంక్రాంతి కానుకగా వస్తుందట. నిజానికి, ఏడాది క్రితమే ఈ సినిమా మేకర్స్ ఈ డేట్ లాక్ చేసుకున్నారు. మిగతా సినిమాలు ఇప్పుడు డేట్ అనౌన్స్ చేశాయి.

ప్రభాస్ హీరోగా రూపొందిన ‘ఆదిపురుష్’కి మిగతా సినిమాలు భయపడకపోవడానికి ఒక రీజన్ ఉంది.

Adipurush

ఈ సినిమా టీజర్ అందరినీ నిరాశపర్చింది. ఒక్కసారిగా సినిమాపై అంచనాలు తగ్గాయి. అందుకే, మిగతా సినిమాలు ధైర్యంగా సంక్రాంతి బరిలోకి దిగాయి. ఐతే, వచ్చే నెల రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి ఏ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందో, ఏది తప్పుకుంటుందో తేలుతుంది.

 

More

Related Stories