
ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో విడుదలవుతుంది. అంటే, ఈ సినిమాని ఇప్పుడే ప్రమోట్ చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడే… ఈ సినిమా మొదటి లుక్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. శ్రీరామనవమి స్పెషల్ గా మొదటి లుక్ ని విడుదల చెయ్యాలని ఆ మూవీ టీం డిసైడ్ అయిందని టాక్.
శ్రీరామనవమి అంటే వచ్చే నెల 21న. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలయింది. ఒక భారీ షెడ్యూల్ మాత్రమే పూర్తి అయింది. అప్పుడే ఫస్ట్ లుక్ వదులుతారా? చూడాలి మరి.
ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న బిగ్ మూవీ. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నాడు. కృతి సనన్ సీతగా నటిస్తోంది. టి సిరీస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ మొత్తంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీస్తున్నారు. అంటే, నటీనటుల వెనుక కనిపించే లొకేషన్లు, బ్యాక్గ్రౌండ్ పూర్తిగా గ్రాఫిక్కులతో నిండి వుంటుంది.