ఆదిపురుష్ కి మరోసారి ట్రోలింగ్

Adipurush

‘ఆదిపురుష్’ సినిమా టీజర్ బాగా ట్రోలింగ్ కి గురి అయింది. అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందనుకున్న టీంకి షాక్ ఇచ్చారు జనం. దేశమంతా ట్రోలింగ్ జరిగింది. దాంతో, దెబ్బకి థింకింగ్ మారిపోయింది. ఈ మూవీ మేకర్స్ తమ సినిమా గ్రాఫిక్స్ మార్చుకుంటామని ప్రకటించాల్సి వచ్చింది. సినిమా విడుదల కూడా ఆర్నెళ్లు వెనక్కి వెళ్ళింది.

ఐతే, ఇదంతా ముగిసిన అధ్యాయం. ట్రోలింగ్ అయిపోయింది అనుకున్నారు అంతా. కానీ, మళ్ళీ ఒక చిన్న సినిమా టీజర్ విడుదల కాగానే ‘ఆదిపురుష్’ ప్రస్తావన మళ్ళీ వచ్చింది.

‘హనుమాన్’ అనే సినిమా టీజర్ విడుదలైంది. ఇది కూడా ‘జైశ్రీరామ్’ ‘జైన్ హనుమాన్’ నినాదాలతో సాగిన సూపర్ హీరో మూవీ టీజర్. అంటే ‘ఆదిపురుష్’కి పోలికలున్న మూవీ. ఈ సినిమా గ్రాఫిక్స్ ‘ఆదిపురుష్’ కన్నా బెటర్ గా ఉన్నాయి అని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఆ విధంగా 300 కోట్ల రూపాయల ‘ఆదిపురుష్’ మూవీ ఒక చిన్న సినిమా వల్ల అవమాన పడాల్సి వచ్చింది.

‘ఆదిపురుష్’ ట్రోలింగ్ నుంచి బయటపడి ప్రభాస్ ఇప్పుడు హిట్ అందుకోవాలంటే చాలా కష్టమే.

 

More

Related Stories