‘ఆదిపురుష్’కి ‘చంద్రయాన్ 3’కి లింక్!

- Advertisement -
Adipurush and Chandryaan 3

“ఆదిపురుష్” సినిమా వచ్చింది, పోయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన “ఆదిపురుష్” నష్టాలనే మిగిల్చింది. ముఖ్యంగా ఉత్తరాదిని ఊపేయ్యడం ఖాయం అనుకున్న ఏరియాలోనే దారుణ పరాజయం చూసింది ఈ సినిమా. విడుదలై నెల రోజుల అవుతోంది. ఇప్పటికే జనం మర్చిపోయారు.

ఐతే, సడెన్ గా శుక్రవారం ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దానికి కారణం “చంద్రయాన్ 3”. మనదేశానికి చెందిన గొప్ప అంతరిక్ష సంస్థ …ఇస్రో. ఈ సంస్థ శుక్రవారం చంద్రయాన్ – 3 (చంద్రుడిపై చేసే ప్రయోగాల కోసం పంపే రోవర్) విజయవంతంగా లాంచ్ చేసింది. 40 రోజుల్లో అది చంద్రుడిపైకి చేరుతుంది.

అమెరికా, రష్యా వంటి దేశాలు వందల మిలియన్ల ఖర్చు చేశాయి ఇలాంటి ప్రయోగాల కోసం. అదే ఇస్రో మాత్రం ‘చంద్రయాన్ -3’ మాత్రం రూ. 615 కోట్లు మాత్రం ఖర్చు చేసింది. ఇక, దీనికి “ఆదిపురుష్”కి ఏంటి లింక్ అంటారా?

ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం “ఆదిపురుష్” సినిమా తీయడానికి ఇంతకన్నా ఎక్కువ ఖర్చు అయింది. దర్శకుడు ఓం రౌత్ “ఆదిపురుష్”కి పెట్టిన ఖర్చు కన్నా మన భారతీయ శాస్త్రవేత్తలు “చంద్రయాన్ 3″కి ఖర్చు పెట్టారని మన శాస్త్రవేత్తలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి. అలా “ఆదిపురుష్” మరోసారి ట్రోలింగ్ కి గురి అవుతోంది.

అఫ్కోర్స్, “ఆదిపురుష్” సినిమాకి సోషల్ మీడియా జనాలు చెప్తున్న దాంట్లో సగం కూడా ఖర్చు కాలేదు. కానీ, దర్శకుడు ఓం రౌత్ దాదాపు నాలుగు వందల బడ్జెట్ తో కూడా ఏమి సాధించలేదు అనేది వారి పాయింట్.

More

Related Stories