ఆదిపురుష్ కి కొత్త డేటప్పుడు?

Adipurush


ఆదిపురుష్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతుంది అని నిన్న కూడా ఒక పోస్టర్ విడుదల చేసింది టీం. ఇప్పుడు ఏమో ఈ సినిమా వాయిదా పడింది అని ప్రచారం. దానికి తగ్గట్లే, సంక్రాంతి బరిలోకి అఖిల్ అక్కినేని మూవీ కూడా వచ్చింది.

ఈ సంక్రాంతికి విడుదల అంటూ ఇప్పటివరకు పోస్టర్లు విడుదల చేసిన చిత్రాలు ఐదు. అవి 1) ఆదిపురుష్ 2) వాల్తేర్ వీరయ్య 3) వీర సింహ రెడ్డి 4) వారసుడు 5) ఏజెంట్. ఇందులో ‘ఆదిపురుష్’ తప్పుకుంటుంది అనేది లేటెస్ట్ టాక్.

ఒకవేళ సంక్రాంతి బరి నుంచి ఈ సినిమా తప్పుకుంటే కొత్త డేట్ ఎప్పుడు? జనవరి 6, జనవరి 26 ఈ రెండు తేదీలను పరిశీలిస్తున్నట్లు టాక్. మరి ఈ రెండు డేట్స్ లో ఎదో ఒకటి అవుతుందా లేదా ముందు అనుకున్న జనవరి 12 అవుతుందా అనేది చూడాలి.

త్వరలోనే ఈ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ‘ఆదిపురుష్’ రామాయణం ఆధారంగా రూపొందుతోన్న మూవీ. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకుడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీని టి.సిరీస్ నిర్మిస్తోంది.

 

More

Related Stories