తెలుగు ఇంకా స్పష్టంగా రాదు: అదితి

Aditi

హీరోయిన్ అదితి రావు హైదరి తెలంగాణ అమ్మాయి. ఆమె పుట్టింది హైదరాబాద్ లోనే. కానీ, ముంబైలోనే పెరిగింది. అందుకే, తెలుగు స్పష్టంగా మాట్లాడలేదు. ఇప్పుడిప్పుడు కాస్త ధైర్యంగా మాట్లాడుతోంది. కానీ, తెలుగులో డైలాగులు డబ్బింగ్ చెప్పాలంటే ఇంకొంతకాలం పడుతుంది అని చెప్తోంది.

ఈ దసరా కానుకగా ఆమె నటించిన ‘మహా సముద్రం’ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాలో ఆమె శర్వానంద్, సిద్ధార్థ్ సరసన నటించింది. ఈ సినిమాలో అదితి ఎవరికీ జోడి అనేది సస్పెన్స్ గా ఉంచారు దర్శకుడు అజయ్ భూపతి. ట్రైలర్స్ లో ఆ మిస్టరీ ఉంది. “మహా సముద్రం” పాత్ర ఎంతో ఇష్టంగా చేశాను అని చెప్తోంది ఈ భామ.

ఇక బయోపిక్స్‌లో నటించడం నాకు ఇష్టమని చెప్తున్న ఈ భామ బాలీవుడ్ హీరోయిన్ రేఖ, గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్స్ లో చెయ్యాలని ఉంది అని తెలిపింది.

కొత్తగా ఇంకొన్ని సినిమాలు కూడా సైన్ చేసిందట. కానీ, “అవి నిర్మాతలు ప్రకటిస్తేనే బాగుంటుంది,” అని సమాధానం ఇచ్చింది.

 

More

Related Stories