
హీరోయిన్ అదితి రావు హైదరి మీద చిత్రీకరించిన మొదటి పాటని రిలీజ్ చేసింది ‘మహా సముద్రం’ టీం. “చెప్పకే చెప్పకే” అనే ఈ పాటలో సినిమాలోని కొన్ని సీన్లు కూడా యాడ్ చేసి వదిలారు. ‘మహా సముద్రం’ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్నారు. అదితి రావు, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్లు.
ఈ పాటలో ఆమె ఇటు శర్వానంద్ తో లవ్ లో ఉన్నట్లు, అటు సిద్ధార్థ్ తో కూడా డేటింగ్ చేసినట్లు చూపించారు. అంటే, ఆమె ఈ సినిమాలో ఇద్దరితో ప్రేమాయణం నడుపుతుందా? లేక ఒక ట్రాక్ ‘ఫ్లాష్ బ్యాక్’లోదా? అన్న ఆసక్తి కలుగుతోంది. పాట కన్నా వీడియోలో ఎక్కువ మ్యాటర్ ఉంది.
“ఆర్ ఎక్స్ 100” సినిమా తో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతికిది రెండో చిత్రం. తన మొదటి సినిమాకి సూపర్ హిట్ సంగీతం అందించిన చింతన్ భరద్వాజ్ తోనే ఈ మూవీ పాటలు చేయించుకున్నాడు అజయ్ భూపతి. మరి ఇది కూడా “ఆర్ ఎక్స్ 100″లా మ్యూజికల్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అన్నది చూడాలి.
అదితికి ఇంతవరకు తెలుగులో భారీ హిట్ లేదు. “సమ్మోహనం” సింపుల్ హిట్. “వి” థియేటర్లలో విడుదల కాలేదు. ఆమెకి క్రేజ్ రావాలంటే ఈ సినిమా పెద్ద హిట్ కావాలి.