ఆదితి ఎప్పుడూ అదే లుక్కా!

Maha Samudram

హీరోలే కాదు హీరోయిన్లు కూడా ఎప్పటికప్పుడు మేకోవర్ కి వెళ్ళాలి. పాత్రకు తగ్గట్లు మారాలి. లేకపోతే.. ఆదితి రావులా కనిపిస్తారు. మణిరత్నం తీసినా, ఇంద్రగంటి సినిమా చేసినా, అజయ్ భూపతి తీసుకున్నా… ఆదితి లుక్ మారట్లేదు. దాదాపుగా ఎక్స్ ప్రెషన్ కూడా ఒకే తీరుగా ఉంటుంది. ఆమెకి టాలెంట్ ఉంది. మంచి నటన ప్రదర్శిస్తుంది. కానీ, పోస్టర్ లుక్స్ మాత్రం అన్ని సినిమాలకు ఒకే మాదిరిగా ఉంటున్నాయి.

నిజానికి ఆమె క్లోజప్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చెయ్యడం దర్శకులే మానెయ్యాలి. ఎందుకంటే పెద్దగా డిఫరెన్స్ ఉండడం లేదు. తాజాగా వచ్చిన ‘మహా సముద్రం’లో ఆదితి ఫస్ట్ లుక్ కూడా అలాగే ఉంది.

ఆదితి రావు తన ఇన్ స్టాగ్రామ్ ఫోటోషూట్ లలో చాలా గ్లామర్ గా కనిపిస్తుంటుంది. వెరైటీ లుక్స్ తో దర్శనమిస్తుంటుంది. కానీ దర్శకులు మాత్రం ఆమెని “హీర్ తో బడి శాడ్ హై” అన్నట్లుగానే చూపిస్తున్నారు.

More

Related Stories