
సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కన్నా పరిచయాలు ముఖ్యం. అలాగే, సినిమా ఇండస్ట్రీ కుటుంబాల నుంచి వచ్చిన నటులకు, సాంకేతిక నిపుణలకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. టాలెంట్, సక్సెస్ ఉంటే అనామకులు కూడా సూపర్ స్టార్ అవుతారు. కానీ, అలాంటి వారి సంఖ్య తక్కువ. అదే సినిమా ఫ్యామిలీ నుంచి వస్తే కూచున్న చోటకే దర్శక, నిర్మాతలు వస్తారు. అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు.
అదితి శంకర్ విషయంలో జరుగుతున్నది అదే. ఆమె దర్శకుడు శంకర్ కూతురు. శంకర్ అంటే షోమ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా. సూపర్ స్టార్లకు సమానంగా క్రేజ్ ఉన్న దర్శకుడు. ఆయన కూతురు కాబట్టే ఆమెకి ఇప్పటికే ఐదు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో రెండు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా ఆమె నటనకు ఏమి పేరు తీసుకురాలేదు.
అయినా మరో మూడు సినిమాల్లో నటిస్తోంది ఇప్పుడు. ఇంకో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయట.
ఐతే, ఆమె కెరీర్ విషయంలో శంకర్ డైరెక్ట్ గా ఏమి కలగచేసుకోవడం లేదు. ఆమెకి అవకాశాలు ఇవ్వమని కూడా ఆయన ఎవరికీ ఫోన్ చెయ్యలేదంట. శంకర్ అంటే ఉన్న గౌరవం, క్లౌట్ తో తమిళ దర్శక, నిర్మాతలు ఆమెకి ఆఫర్లు ఇస్తున్నారని టాక్.
శంకర్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.