విడుదలైన శంకర్ కూతురు మొదటి చిత్రం

- Advertisement -
Aditi Shankar


ప్రముఖ దర్శకుడు శంకర్ తన చిన్న కూతురు ఆదితిని హీరోయిన్ గా కెరీర్ ఎంచుకునేందుకు అంగీకరించడమే కాదు ఆమె మొదటి రెండు చిత్రాలు పెద్ద హీరోల సరసన ఉండేలా చూసుకున్నారు. ఆదితి శంకర్ నటించిన తొలి చిత్రం… వీరుమాన్. కార్తీ హీరో. ఈ సినిమా ఆగస్టు 12న విడుదలైంది. సినిమాకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ, ఓపెనింగ్ కలెక్షన్లు బాగున్నాయి.

శంకర్ కూతురు నటనకు కూడా పెద్దగా మార్కులు పడలేదు. కాకపొతే, ఆమెకి ఇది సేఫ్ లాంచ్ అని చెప్పొచ్చు.

సాధారణంగా కార్తీ నటించే ప్రతి తమిళ చిత్రం తెలుగులో అనువాదం అవుతుంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలవుతుంది. కానీ “వీరుమాన్” అనే ఈ చిత్రం విషయంలో అలా జరగలేదు. ఇది తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా కాదని అనుకున్నారు కాబోలు. దాంతో, ఆదితి తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాలేదు.

ఆమె రెండో చిత్రం… తమిళ అగ్ర యువ హీరో శివ కార్తికేయన్ సరసన. ఈ సినిమా ఇటీవలే ప్రారంభం అయింది. ఇది తెలుగులో డబ్ అయ్యే అవకాశం ఉంది.

 

More

Related Stories