నేను దారుణంగా మోసపోయాను- శేష్

కెరీర్ స్టార్టింగ్ లో హీరోహీరోయిన్లు మోసపోవడం అనేది చాలా కామన్. అలాంటి పాఠాలు నేర్చుకోకపోతే ఇండస్ట్రీలో ఎదగలేం. హీరో అడివి శేష్ కూడా అలానే మోసపోయాడు. తను మోసపోయిన విధానాన్ని పూసగుచ్చినట్టు వివరించాడు.

“నాకప్పుడు 15 ఏళ్లు. చందమామ సినిమా నుంచి ఆఫర్ వచ్చింది. నవదీప్ చేసిన పాత్రను నన్నే చేయమన్నారు. 2 రోజులు షూటింగ్ కూడా చేశాను. కానీ అంతలోనే ఆ సినిమా ఆగిపోయింది. అదే టైమ్ లో సొంతం సినిమా నుంచి ఆఫర్ వచ్చింది. మూవీలో ఓ కీలక పాత్ర ఉంది, మంచి పేరొస్తుంది చేస్తావా అని అడిగారు. చిన్నపాటి నెరేషన్ కూడా ఇచ్చారు. నేను ఓకే చెప్పాను. సొంతం సినిమాలో నా పోర్షన్ షూటింగ్ 3 రోజుల్లో పూర్తి చేశారు. కీలక పాత్ర అన్నారు, 3 రోజుల్లో పూర్తిచేశారేంటి అనే అనుమానం నాకొచ్చింది. కట్ చేస్తే, సొంతం సినిమా విడుదలైన తర్వాత అసలు విషయం అర్థమైంది. సినిమాలో కేవలం 5 సెకెన్లు మాత్రమే కనిపించాను. అప్పుడు అర్థమైంది నేను మోసపోయానని, వెంటనే అమెరికా వెళ్లిపోయాను.”

ఇలా కెరీర్ స్టార్టింగ్ లో తను ఎలా మోసపోయాడో వివరించాడు అడివి శేష్. మేజర్ ప్రమోషన్ ను మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన ఈ నటుడు, మంచి సినిమా తీస్తే ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. గతంలో క్షణం లాంటి సినిమా తీసినప్పుడు ఓపెన్ గా అంతా మద్దతిచ్చారని అన్నాడు. మేజర్ సినిమా రిలీజైన తర్వాత కూడా అదే విధంగా హీరోలంతా తనకు మద్దతిస్తారని అంటున్నాడు.

 

More

Related Stories